చెన్నై ఎయిర్‌పోర్ట్ (Chennai Airport) కొత్త టెర్మినల్ తమిళ సంస్కృతిని ప్రతిబింభించేలా రూపొందించారు. కొలం (దక్షిణ భారత గృహాల ముందు గీసిన నమూనా లేదా డిజైన్), చీర, దేవాలయాలు, స్థానిక విషయాలను హైలైట్ చేస్తూ సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) శనివారం (ఏప్రిల్ 8) చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. తమిళనాడులో పెరుగుతున్న విమాన ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. 1,36,295 చ.మీ విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, T-2 (ఫేజ్ -1) నిర్మాణం రూ. 1260 కోట్లతో విమానాశ్రయం టెర్మినల్ ను నిర్మించారు. ఈ అత్యాధునిక సదుపాయాలు ఏటా 35 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాలను కలిగి ఉంటాయి. కొత్త టెర్మినల్ తమిళ సంస్కృతిని ప్రతిబింభించేలా రూపొందించారు. కొలం (దక్షిణ భారత గృహాల ముందు గీసిన నమూనా లేదా డిజైన్), చీర, దేవాలయాలు, స్థానిక విషయాలను హైలైట్ చేసే ఇతర అంశాలు వంటి సంప్రదాయ లక్షణాలను కలిగి ఉంది.

ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం పలు కీలక విషయాలను వెల్లడించింది. “ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయం (Chennai Airport)లో 2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, పెరుగుతున్న రద్దీను తీర్చడానికి సిద్ధంగా ఉంది… అంటూ ట్విట్ చేసింది. “ప్రయాణికులకు అధిక-నాణ్యత మౌలిక సదుపాయాలను అందించడంలో.. ప్రభుత్వ నిబద్ధతకు ఇది ప్రతిబింబం” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇది కనెక్టివిటీని పెంచుతుందని.. ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది.