PF కొత్త రూల్స్ 2026 – PF ఆన్‌లైన్‌లో ఎలా విత్‌డ్రా చేయాలి (స్టెప్ బై స్టెప్ గైడ్)
ఇటీవల EPF (Provident Fund) నియమాల్లో (PF కొత్త రూల్స్ 2026) మార్పులు జరిగాయి. చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయి
EPF కొత్త రూల్ – 25% మినిమమ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి?
EPFO నియమాల ప్రకారం, మొత్తం PFని ఒకేసారి తీసుకోలేరు. మీ PF బ్యాలెన్సులో మీ కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్, వడ్డీ ఉంటుంది. మీ PF ఎకౌంటులో 25% తప్పనిసరిగా ఉండాలి. మీరు 75% వరకు విత్‌డ్రా చేయవచ్చు.
ఉదాహరణకు: మీ PF బ్యాలెన్స్ = ₹1,00,000 ఇందులో 25% అనగా ₹25,000 తప్పనిసరిగా ఉంచాలి. 75% అనగా ₹75,000 వరకు విత్‌డ్రా చేయవచ్చు.
మిగిలిన 25% PF ఎప్పుడు తీసుకోవచ్చు?
ఈ క్రింద పరిస్థితుల్లో మాత్రమే మిగిలిన 25% తీసుకోవచ్చు:
- రిటైర్మెంట్ తర్వాత
- శాశ్వత వైకల్యం (Permanent Disability)
- ఉద్యోగం పూర్తిగా మానేసిన 12 నెలలు తరవాత
కొత్త నియమాల ప్రకారం 12 నెలల నిరుద్యోగం తర్వాతే 100% PF విత్‌డ్రా అనుమతి.
EPF పాత నియమాలు vs కొత్త నియమాలు
1️⃣ పెళ్లి కోసం PF విత్‌డ్రా
పాత రూల్: 7 సంవత్సరాల సర్వీస్ అవసరం
కొత్త రూల్: కేవలం 1 సంవత్సరం సర్వీస్ సరిపోతుంది
2️⃣ ఇల్లు కొనుగోలు / నిర్మాణం
పాత రూల్: 5 సంవత్సరాల సర్వీస్
కొత్త రూల్: కేవలం 1 సంవత్సరం సర్వీస్
1 సంవత్సరం సర్వీస్ ఉంటే, ఈ అవసరాలకు PF తీసుకోవచ్చు:
- మెడికల్ ఎమర్జెన్సీ
- చదువు
- పెళ్లి
- ఇల్లు కొనుగోలు / నిర్మాణం
కొత్త నిరుద్యోగ నియమం (ముఖ్యం )
పాత రూల్: 2 నెలలు ఉద్యోగం లేకపోతే 100% PF
కొత్త రూల్: 12 నెలలు ఉద్యోగం లేకపోవాలి
👉 ఉద్యోగం అకస్మాత్తుగా పోయిన వారికి ఇది ముఖ్యమైన మార్పు.
పెన్షన్ (EPS) విత్‌డ్రావల్ నియమం
మీ PF అకౌంట్‌లో EPF (PF) తో పాటుగా EPS (పెన్షన్) కూడా ఉంటుంది. పెన్షన్ డబ్బు తీసుకోవాలంటే 36 నెలలు (3 సంవత్సరాలు) ఉద్యోగం లేకపోవాలి. ( అనగా జాబు మానేసిన ౩ సంవత్సరాల తరవాత)
PF విత్‌డ్రావల్‌పై TDS నియమాలు
PF ₹50,000 కంటే తక్కువైతే
- TDS లేదు
- PAN అవసరం లేదు
- పూర్తి డబ్బు వస్తుంది
PF ₹50,000 కంటే ఎక్కువైతే
| PAN స్థితి | TDS |
|---|---|
| PAN ఇవ్వకపోతే | 20% |
| PAN ఇస్తే | 10% |
TDS తప్పించుకోవాలంటే Form 15G మరియు Form 15H ఇవ్వాలి:
- వయసు 60 కంటే తక్కువ → Form 15G
- వయసు 60 పైగా → Form 15H
ఉద్యోగం వదిలిన తర్వాత PF వడ్డీ
- ఉద్యోగంలో ఉన్నప్పుడు → 8.25% వడ్డీ
- ఉద్యోగం వదిలిన తర్వాత → 3 సంవత్సరాల వరకు వడ్డీ
- 3 సంవత్సరాల తర్వాత → వడ్డీ లేదు
PF ఆన్‌లైన్‌లో ఎలా విత్‌డ్రా చేయాలి?
Step 1: EPFO వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
బ్రౌజర్‌లో EPFO అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
Step 2: Unified Member Portal
Online Services → Unified Member Portal క్లిక్ చేయండి.
Step 3: లాగిన్
- UAN నెంబర్
- పాస్‌వర్డ్
- మొబైల్‌కు వచ్చిన OTP
Step 4: KYC చెక్ చేయండి
ఇవి తప్పనిసరిగా వెరిఫై అయి ఉండాలి:
- Aadhaar
- PAN
- బ్యాంక్ అకౌంట్ + IFSC
👉 మూడు Approved అయి ఉండాలి.
PF ఫారమ్‌ల వివరాలు
✅ Form 19 – పూర్తి PF విత్‌డ్రా
✅ Form 31 – అడ్వాన్స్ PF (మెడికల్, పెళ్లి, చదువు, ఇల్లు)
✅ Form 10C – పెన్షన్ డబ్బు తీసుకోవడానికి
✅ Form 10D – రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్
Step 5: డాక్యుమెంట్స్ అప్లోడ్
- బ్యాంక్ పాస్‌బుక్ / క్యాన్సిల్ చెక్
- Form 15G / 15H (అవసరమైతే)
Step 6: Aadhaar OTP
OTP వెరిఫై చేసి Submit చేయండి.
PF క్లెయిమ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- Unified Member Portal లాగిన్
- Track Claim Status క్లిక్
- సాధారణంగా 5 నుంచి 14 రోజుల్లో డబ్బు వస్తుంది
PF రిజెక్ట్ అయ్యే కారణాలు
- KYC మ్యాచ్ కాకపోవడం
- తప్పు బ్యాంక్ వివరాలు
- తప్పు ఫారమ్ ఎంచుకోవడం
👉 తప్పులు సరిచేసి మళ్లీ అప్లై చేయవచ్చు.
చివరి సలహా – PF విత్‌డ్రా చేయాలా? వద్దా?
EPF ఉద్దేశ్యం రిటైర్మెంట్ భద్రత, పన్ను లేని రిటర్న్స్, 8.25% కాంపౌండెడ్ వడ్డీ కాబట్టి
👉 అత్యవసర పరిస్థితుల్లో తప్ప PF తీసుకోకపోవడం మంచిది.
👉 దీర్ఘకాలంలో PF మీకు బలమైన ఫైనాన్షియల్ సపోర్ట్.
ఈ సమాచారం ఉపయోగపడితే:
✅ ఇతరులకు షేర్ చేయండి
✅ మీ సందేహాలు కామెంట్ చేయండి
✅ ఫైనాన్స్ & అన్ని రకాల అప్‌డేట్స్ కోసం మా వెబ్ పేజీ ఫాలో అవ్వండి 👍
PF New Rules 2026 – Top 10 FAQs
1️⃣ EPF కొత్త రూల్స్ 2026 ప్రకారం 100% PF విత్‌డ్రా చేయవచ్చా?
అవును, కానీ 12 నెలలు పూర్తిగా ఉద్యోగం లేకుండా (Unemployed) ఉన్న తర్వాత మాత్రమే 100% PF విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది.
2️⃣ 25% మినిమం బ్యాలెన్స్ రూల్ అంటే ఏమిటి?
మీ PF అకౌంట్‌లో ఉన్న మొత్తం అమౌంట్‌లో 25% తప్పనిసరిగా అకౌంట్‌లోనే ఉండాలి. మిగిలిన 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
3️⃣ PF విత్‌డ్రా చేయడానికి కనీసం ఎంత సర్వీస్ ఉండాలి?
కొత్త EPF రూల్స్ ప్రకారం కేవలం 1 సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు – మ్యారేజ్, మెడికల్, ఎడ్యుకేషన్, హౌస్ కోసం PF తీసుకోవచ్చు.
4️⃣ ఆన్లైన్‌లో PF ఎలా విత్‌డ్రా చేయాలి?
EPFO వెబ్‌సైట్ → Unified Member Portal → UAN లాగిన్ → KYC వెరిఫికేషన్ → సరైన ఫారం సెలెక్ట్ చేసి క్లెయిమ్ సబ్మిట్ చేయాలి.
5️⃣ Form 19, Form 31, Form 10C, Form 10D మధ్య తేడా ఏమిటి?
Form 19 – పూర్తిగా PF విత్‌డ్రా
Form 31 – Partial PF విత్‌డ్రా
Form 10C – Pension (EPS) విత్‌డ్రా
Form 10D – మంత్లీ పెన్షన్ క్లెయిమ్
6️⃣ PF విత్‌డ్రా చేసినప్పుడు TDS కట్ అవుతుందా?
PF అమౌంట్ ₹50,000 కంటే ఎక్కువ అయితే TDS కట్ అవుతుంది.
PAN ఇచ్చితే 10%, PAN లేకపోతే 20% TDS ఉంటుంది.
7️⃣ PF పై TDS తప్పించుకోవడానికి ఏమి చేయాలి?
మీరు టాక్స్ లయబిలిటీ లేకపోతే; Age < 60 అయితే Form 15G, Age ≥ 60 అయితే Form 15H సబ్మిట్ చేస్తే TDS కట్ అవ్వదు.
8️⃣ జాబ్ వదిలిన తర్వాత PF కి ఎంతకాలం ఇంట్రెస్ట్ వస్తుంది?
జాబ్ వదిలిన తర్వాత గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే 8.25% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ రావడం ఆగిపోతుంది.
9️⃣ పెన్షన్ అమౌంట్ (EPS) ఎప్పుడు విత్‌డ్రా చేయవచ్చు?
పెన్షన్ కాంపోనెంట్ విత్‌డ్రా చేయాలంటే 36 నెలలు (3 సంవత్సరాలు) అన్ఎంప్లాయిడ్‌గా ఉండాలి.
🔟 PF క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
KYC Miss Match, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పు, తప్పు ఫారం సెలెక్ట్ చేయడం. వీటిని సరిచేసి మళ్లీ అప్లై చేయవచ్చు.