ఎన్టీఆర్ హౌసింగ్ పథకం (NTR Housing Scheme 2026) – ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) కీలక అప్డేట్
ఏపీలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం (NTR Housing Scheme) కింద అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (Pmay G) కు సంబంధించి ప్రభుత్వం ముఖ్యమైన వెల్లడించింది. గత డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి లోపు వెరిఫికేషన్ పూర్తిచేసి, లబ్ధిదారుల ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దరఖాస్తుల స్వీకరణ – వెరిఫికేషన్ ప్రక్రియ
డిసెంబర్ 2025లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా (Pmay G – Ntr Housing scheme 2026) వివరాలు నమోదు చేసి, గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారుల ఇళ్ల ఫోటోలు, పరిసరాల జియో ట్యాగింగ్ పూర్తి చేశారు.
అనంతరం మండల స్థాయిలో ఎంపీడీఓలు, అసిస్టెంట్ ఇంజినీర్లు ఈ వివరాలను పరిశీలిస్తున్నారు. అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
సేకరించిన డేటా వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి సంబంధించిన డేటాను సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ డేటాలో ఆదాయం, సొంత స్థలం ఉందా లేదా, ఇంటి స్థితి వంటి అంశాలను పరిశీలించి అనర్హులను తొలగిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 15లోపు పూర్తవుతుంది.
ఇళ్ల నిర్మాణాల పురోగతి
ఇప్పటికే ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది. గత 18 నెలల్లో 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 3 లక్షల ఇళ్లను అందజేశారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక సహాయం వివరాలు
ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరు వచ్చిన గ్రామీణ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 2,50,000 మంజూరు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 1,50,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 1,00,000. ఈ మొత్తం నాలుగు దశల్లో విడుదల అవుతుంది.
-
పునాది దశలో: రూ. 6,000
-
గోడల నిర్మాణం పూర్తైన తర్వాత: రూ. 60,000
-
స్లాబ్ దశలో: రూ. 60,000
-
పూర్తి చేసి పెయింటింగ్ అనంతరం: రూ. 7,000
అదనంగా ఉపాధి హామీ పనులు, స్వచ్ఛ భారత్ పథకం కింద కలిపి సుమారు రూ. 39,000 వరకు మరింత సహాయం లభిస్తుంది. దీంతో మొత్తం సహాయం రూ. 2,89,000 వరకు అందనుంది.
లబ్ధిదారులకు శుభవార్త
గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ యాప్‌లో వివరాలు నమోదు చేసిన ఇల్లు లేని పేదలకు త్వరలోనే మంచి శుభవార్త రానుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.