Mothers Day 2024: అమ్మ ప్రేమను వివరించ లేము. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిని గౌరవించాలి. ప్రతి రోజూ అమ్మని ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అత్యంత పేదవాడు ధనం లేనివాడు కాదు.. అమ్మ ప్రేమ లేని వాడేనని ఎంతో మంది ప్రముఖులు పేర్కొన్నారు. ఇక మదర్స్ డే గురించి చూస్తే… ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. అయితే ఈ ఏడాది మే రెండవ ఆదివారం, మే 12 న మదర్స్ డే జరపనున్నారు. ఈ మదర్స్ డే (Mothers Day) వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంది. మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి గ్రీస్ దేశస్తులు రియా అనే ఒక దేవతను నివాళులర్పించేవారు.
ఇంగ్లాండ్‌లో 17వ శతాబ్దంలో తల్లులకు గౌరవంగా మదర్ సండే ఉత్సవాలు నిర్వహిచేవారు. జూలియ వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా 1872లో ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేయడం జరిగింది.
అమెరికాలో 1911 నాటికి మాతృ దినోత్సవాన్ని జరపడం మొదలెట్టారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ 1914 నుంచి అధికారికంగా మాతృ దినోత్సవాన్ని జరిపించాలని నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మే రెండో ఆదివారం మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మదర్స్ డే 2024 శుభాకాంక్షలు, కొటేషన్లు, మెసేజీలు, ఫొటోలు (Mother’s Day 2024 Wishes, Quotes, Messages, Photos:):
- అమ్మా.. నీ సహనం, ఓపిక సాటిలేనివి. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఇది ఈ లోకమంతటికీ దేవుడిచ్చిన ఆశీర్వాదం. మదర్స్ డే శుభాకాంక్షలు.

- నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. అంతులేని ప్రేమ కురిపిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వు నా వరం అమ్మా. మదర్స్ డే శుభాకాంక్షలు.
- నువ్వే నా సూపర్ హీరో. ఏ సమస్య వచ్చినా నన్ను ఆదుకునే ఆపన్నహస్తం నువ్వు. ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరకుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే.
- అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ.
- చిన్ననాడు బుడిబుడి అడుగులకు ఆలంబన అమ్మ, తడబడు అడుగులకు సవరణ అమ్మ.
అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ చెప్పాలన్న ఆశ చావడం లేదు. మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలనుంది. కనిపెంచని దేవుడైనా, నాకు నీ తర్వాతే అమ్మా.. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా నీ రుణం తీర్చుకోలేను. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ.

- ఈరోజు ఈ ప్రపంచం నీకోసం వేడుకలు జరుపుతుంది. కానీ నీకోసం ఈ కుటుంబం ప్రతి రోజూ వేడుకలు చేస్తుంది. ఈ ప్రపంచంలోనే మంచి అమ్మవు నువ్వు. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ.
- అమ్మ అనే పదం కమ్మనైనది, తియ్యనైనది
అమ్మ తోడుంటే దేన్నయినా ఓడలేని గెలుపు మనది
అమ్మ మనసు సదా కల్మషం లేనిది, స్వచ్ఛమైనది
ఇవన్నీ ఉన్న మా అమ్మ నాకెంతో ఇష్టమైనది. మదర్స్ డే శుభాకాంక్షలు
- ఈ లోకంలో అన్నింటికన్నా అతి మధురమైనది, అమూల్యమైనది, అందమైనది అమ్మ అనురాగమే. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.