విశాఖపట్నం: స్కూటీపై మృతశిశువు (Visakhapatnam) స్వగ్రామానికి తరలింపు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కేజీహెచ్ (KGH) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చిన్నారి చికిత్స పొందిన పీడియాట్రిక్ వార్డు నుంచి సరైన రీతిలో ట్రైబల్ సెల్‌కు సమాచారం అందించనందుకుగాను అక్కడ విధుల్లో వున్న ఇద్దరు నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్ మెమో జారీచేశారు. అలాగే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంపైనా ఉన్నతాధికారులు ఆగ్రహాన్ని వ్యక్తంచేసినట్టు సమాచారం. ట్రైబల్ సెల్‌లో ఆయా ఖాళీలు భర్తీచేయాలని సూచించారు.