Accident: బోల్తా పడిన లారీ.. కాళ్లు, తలకాయల కోసం ఎగబడ్డ జనం

admin
By admin 924 Views
1 Min Read

TS: మెదక్ జిల్లాలో ప్రమాద వశాత్తు ఓ లారీ బోల్తా ( Accident) పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు.. గాయపడిన వారికి సహాయం చేయాల్సింది పోయి.. సంచులు పట్టుకుని తలకాయలు, కాళ్ల కోసం ఎగబడ్డారు. దొరికినకాడికి సంచుల్లో నింపుకుని ఇంటికి తీసుకెళ్లి మాంచి దావత్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నుంచి హైదరాబాద్‌కు మేక తలకాయలు, కాళ్లు తరలిస్తోన్న లారీ.. మెదక్- తూప్రాన్‌ మీదుగా వెళ్తోంది. అయితే.. నాగుల పల్లి చౌరస్తా వద్ద ప్రమాద వశాత్తు ఆ లారీ బోల్తాపడింది. దీంతో.. మేక తలకాయలు, కాళ్లు పెట్టి ఉంచిన ఐస్ బాక్సులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో అది చూసిన జనాలు.. వాటి కోసం ఎగబడ్డారు.

కొందరు చేతులతో పట్టుకోగలిగినన్ని తీసుకెళ్తే.. మరికొందరు కవర్లు, సంచుల్లో నింపుకున్నారు. కొందరైతే.. నాలుగు నాలుగు తలకాయలను చేతులతో పట్టుకుని తీసుకెళ్లటం.. గమనార్హం. ప్రస్తుతం మటన్ రేటు మంటెక్కిస్తుంటే.. తలకాయ ధర కూడా గట్టిగానే ఉంది. దీంతో.. ఇలా ఎక్కువ ధర పలికే తలకాయలు ఫ్రీగా దొరుకుతుంటే.. మన జనాలు ఆగుతారా.. వెనకొచ్చే వానికి దొరకనిస్తారా..? ఈ ప్రమాదమేమో కానీ.. జనాలు పెద్ద ఎత్తున రోడ్డు మీదికి రావటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *