లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల కోసం 841 ఖాళీల భర్తీకి (LIC Recruitment 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్దులు సెప్టెంబర్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగార్డులకు నెలకు రూ.లక్షా 20 వేలకుపైగా జీతం వస్తుంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి?
అసిస్టెంట్ ఇంజనీర్ (AE): 81 పోస్టులు
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్: 410 పోస్టులు
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జర్నలిస్ట్: 350 పోస్టులు
విద్యా అర్హతలు:
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులకు B.E./B.Tech డిగ్రీ కలిగి ఉండాలి (సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్). ఈ డిగ్రీ AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి పొందాలి.
AAO స్పెషలిస్ట్ & AAO జర్నలిస్ట్: ఏదైనా సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా ఏ ఫీల్డ్‌లో గ్రాడ్యుయేట్ అయినా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి AE పోస్టులు, మిగతా వారందరికీ AAO పోస్టులు ఓపెన్.
వయస్సు పరిమితి:
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2025 ఆధారంగా లెక్కించబడుతుంది. కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30-32 సంవత్సరాలు (పోస్టును బట్టి మారవచ్చు). రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు (SC/ST/OBC/PWD) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. కాబట్టి, మీరు రిజర్వేషన్ కేటగిరీలో ఉంటే, అధికారిక నోటిఫికేషన్‌లో మీకు వర్తించే వయస్సు సడలింపు గురించి తెలుసుకోండి.
LIC AAO Exam Summary | |
Organization | Life Insurance Corporation of India (LIC) |
Post Name | Assistant Administrative Officer (AAO) |
Streams | Generalist & Specialist |
Vacancies | AAO- 760 AE- 81 |
Exam Level | National |
Category | Govt. Jobs |
Mode of Application | Online |
Educational Qualification | Graduation |
Age Limit | 21 to 30 Years (as on 01/08/2025) |
Salary | Rs.1,26,000/- per month |
Exam Mode | Online |
Language | English/ Hindi |
Official Website | Click Here |
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
LIC AAO, AE ఎంపిక ప్రక్రియలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఈ పరీక్ష అక్టోబర్ 3, 2025న నిర్వహించబడుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, ఇందులో మీ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
మెయిన్స్ ఎగ్జామ్: ప్రిలిమ్స్ క్లియర్ చేసినవారు నవంబర్ 8, 2025న మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది కొంచెం డీప్‌గా ఉంటుంది. మీ స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి.
ఈ రెండు దశల్లో సక్సెస్ అయితే మీరు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానానికి ఎంపిక అవుతారు. కాబట్టి ఇప్పుడే అప్లై చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మరి.
దరఖాస్తు ప్రక్రియ: పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మీరు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.inలో రిజిస్టర్ చేసుకుని సెప్టెంబర్ 8, 2025లోపు అప్లై చేసువాలి.
అప్లికేషన్ ఫీజు:
రూ. SC/ST/PwBD అభ్యర్థులకు రూ. 85, ఇతర అభ్యర్థులకు రూ. 700.
LIC AAO 2025 Important Dates
Events | Dates |
LIC AAO 2025 Notification | 16th August 2025 |
LIC AAO Apply Online Starts | 16th August 2025 |
Last Date to Apply Online | 8th September 2025 |
Last Date to Pay Application Fee | 8th September 2025 |
LIC AAO Prelims Exam | 3rd October 2025 |
LIC AAO Mains Exam | 8th November 2025 |