IPPB: ఏడాదికి కేవలం రూ.299తో రూ.10 లక్షలు.. పోస్టాఫీస్ అదిరిపోయే పాలసీ

admin
By admin 1.6k Views
3 Min Read

IPPB: గతంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో హెల్త్ పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య అధికమవుతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా కరోనా వచ్చిన దగ్గరి నుంచి ప్రజల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన బాగా పెరిగింది. హెల్త్ పాలసీలు తీసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. వయసు ప్రతిపాదికన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కూడా మారుతుంది. టర్మ్ ప్లాన్లతో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవలే తన కస్టమర్లకు స్పెషల్ గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ (Group Accident Guard Policy )స్కీమ్ అందిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ. 299, రూ. 399 వంటి తక్కువ ప్రీమియంతోనే రూ. 10 లక్షల వరకు బీమా కవరేజ్ పొందొచ్చు.

విశాఖ: ఆటోల్లో ప్రయనిస్తున్నారా.. ఆదమరిస్తే అంతే.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), టాటా ఏఐజీ (TATAAIG) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కస్టమర్లు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. 18 నుంచి 65 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్పెషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. కొత్తగా తీసుకువచ్చిన ఇన్సూరెన్స్ పాలసీల వద్ద ప్రమాదవశాత్తు పాలసీ దారుడు మరణించినా లేదంటే శాశ్వత అంగ వైకల్యం సంభవించినా రూ. 10 లక్షల బీమా లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. అంతేకాకండా ఈ బెనిఫిట్ పొందాలని భావించే వారికి కచ్చితంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండాలి.

గొర్రెలు పెంపకానికి కోటి రుణం.. కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం

ప్రమాదం జరిగి పాలసీ తీసుకున్న వ్యక్తి హాస్పిటల్‌లో చేరితే.. ఐపీడీ కింద ట్రీట్‌మెంట్ కోసం రూ. 60 వేల వరకు అందిస్తారు. అలాగే ఓపీడీ వంటి వారికి రూ. 30 వేలు ఇస్తారు. ఇంకా పాలసీ తీసుకున్న వారికి ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రూ. 399 ప్రీమియం పాలసీ తీసుకున్న వారికి ఇద్దరి పిల్లలకు రూ. లక్ష వరకు ఎడ్యుకేషన్ ఖర్చుల కోసం చెల్లిస్తారు. ఇంకా హాస్పిటల్‌లో రోజు వారీ ఖర్చులకు రోజుకు రూ.1000 చొప్పున 10 రోజులు చెల్లిస్తారు. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా వస్తాయి. పాలసీ దారుడు మరణిస్తే ఫ్యునరల్ ఖర్చులకు (దహన సంస్కారాలకు) రూ. 5 వేల వరకు చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకోవాలని భావించే వారు దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Group Accident Insurance (Group Accident Guard Policy) Plan Rs.399

Accidental Death 1000000
Permanent Total Disability 1000000
Permanent Partial Disability 1000000
Accidental Dismemberment and Paralysis 1000000
Accidental Medical Expenses IPD Fixed upto Rs 60,000 or actual claims whichever is lower
Accidental Medical Expenses OPD Fixed upto Rs 30,000 or actual claims whichever is lower
Education Benefit 10% of SI or Rs 100000 or Actual whichever is lower for maximum 2 eligible children
In-Hospital Daily Cash Rs 1000 per day upto 10days (1day deducible)
Family Transportation Benefits Rs 25000 or actuals whichever is lower
Last Rites Benefit Rs 5000 or actuals whichever is lower

Group Accident Insurance (Group Accident Guard) Plan Rs.299

Accidental Death 1000000
Permanent Total Disability 1000000
Permanent Partial Disability 1000000
Accidental Dismemberment and Paralysis 1000000
Accidental Medical Expenses IPD Fixed upto Rs 60,000 or actual claims whichever is lower
Accidental Medical Expenses OPD Fixed upto Rs 30,000 or actual claims whichever is lower

Group Accident Insurance (Group Accident Guard) Video

/Web Stories/

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar