ఏమిటి మార్జిన్ హైకింగ్ (What is Margin Hiking Gold Price)
స్టాక్ మార్కెట్ (Stock Market) లో లేదా గోల్డ్ ట్రేడింగ్ (Gold Trading) లో ఎవరైనా బంగారం కొనాలంటే మొత్తం డబ్బు కట్టాల్సినవసరం లేదు. కొంత మార్జిన్ను కట్టి పెద్ద మొత్తంలో వ్యాపారం చేయవచ్చు. కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ ఈ మార్జిన్ ధరను పెంచేస్తుంది. దీంతో నిన్నటి వరకు 100 రూపాయలు కట్టి వ్యాపారం చేసినవాడు నేడు 200 రూపాయలు కట్టి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇంత డబ్బు లేని ట్రేడర్లు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు ఒక్కసారిగా పడిపోతాయి.1980’s silver thread & downfall of Hunt Brothers
1980 నాటి సిల్వర్ త్రెడ్ (1980’s silver thread) ఇక హంట్ బ్రదర్స్ పతనం (downfall of Hunt Brothers) కూడా ఒకసారి మనం గమనించాలి. 1980 లో హంట సోదరులు ప్రపంచంలోని వెండినంతటిని కొనేసి ధరలను ఆకాశాన్ని తీసుకెళ్ళాలని చూశారు. అప్పుడు అమెరికా ఎక్స్చేంజ్ మార్జిన్లను భారీగా పెంచేసింది. ఫలితంగా వెండి బంగారం యొక్క ధరలు కుప్పకూలాయి. ఒక్క రాత్రిలో బిలియన్ల సంపద ఆవిరైపోయింది. 2011లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 1900 డాలర్లకు చేరింది. అప్పుడు కూడా చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ ఏకంగా మూడు రోజుల్లో రెండు సార్లు మార్జిన్లను పెంచింది. దీంతో అతికొన్ని రోజుల్లోనే బంగారం ధర 15 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం చైనా తన విదేశీ నిల్వలను డాలర్ల నుంచి బంగారానికి మారుస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే చైనా కొంటున్నటువంటి బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు ధరలను అదుపులో ఉంచేందుకు అమెరికా ఈ మార్జిన్ అస్త్రాన్ని వాడుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా గతంలో వలె బంగారం రెట్లు గణనీయంగా తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాదారణంగా మార్జిన్లను పెంచినప్పుడు తాత్కాలికంగా ధరలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేసి బయటకి వచ్చేస్తారు. అయితే భారత్, చైనా వంటి దేశాలు ఫిజికల్ గోల్డ్ ను అత్యధికంగా ఉపయోగితున్నాయి. కాబట్టి బంగారం ధరలు 2011 లాగా భారీగా పడిపోతాయా లేక కొంచెం మాత్రమే తగ్గి చిన్న బ్రేక్ తీసుకుంటాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చైనా పంతం నెగ్గుతుందా లేక అమెరికా మార్జిన్ మాయాజాలం పసిడిని కిందకు దించుతుందా అనేది వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి.Margin Hiking Gold Price
1. Margin Hiking అంటే ఏమిటి?
Margin Hiking అంటే బ్యాంకులు లేదా exchanges (MCX లాంటి) gold trading లో పెట్టాల్సిన margin amount ను పెంచడం. అంటే gold buy చేయాలంటే ముందుగా ఎక్కువ డబ్బు deposit చేయాల్సి వస్తుంది.
2. Margin Hiking వల్ల Gold Price పెరుగుతుందా లేక తగ్గుతుందా?
సాధారణంగా Margin Hiking వల్ల short-term లో Gold Price తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే traders కి ఎక్కువ margin అవసరం కావడంతో buying pressure తగ్గుతుంది.
3. Margin Hiking వల్ల long-term లో Gold Rate మీద ప్రభావం ఉంటుందా?
Long-term లో Margin Hiking కి direct impact ఉండదు.
Gold Rate ఎక్కువగా depend అవుతుంది:
International Gold Price
Dollar vs Rupee
Inflation
Global geopolitical situation
4. Common people కి Margin Hiking వల్ల ఏమైనా నష్టం ఉంటుందా?
Physical gold (బంగారం ఆభరణాలు) కొనేవాళ్లకు direct impact ఉండదు.
కానీ:
Gold Rate కొద్దిగా fluctuate అవ్వచ్చు
Digital Gold లేదా Futures Trading చేసేవాళ్లకు ప్రభావం ఉంటుంది
5. Margin Hiking ఎందుకు చేస్తారు?
Market లో high volatility ఉన్నప్పుడు లేదా Gold Price చాలా వేగంగా పెరుగుతున్నప్పుడు speculation control చేయడానికి Margin Hiking చేస్తారు.
6. Margin Hiking Gold Investment కి మంచిదా చెడ్డదా?
Margin Hiking అనేది neither good nor bad. ఇది market stability కోసం తీసుకునే decision. Smart investors దీనిని అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి.