అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అరెస్ట్ పై స్పందించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
విశాఖపట్నం: అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం ఎటువంటి ప్రజాస్వామ్యo కిందకు వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu), వారి తనయుడు రాజేష్ లను రాత్రి 3గం. ల ప్రాంతంలో అక్రమంగా 200 మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి, తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసి అరెస్టు చేయడం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని గంటా నూకరాజు అన్నారు. ఎంతో గౌరవమైన కుటుంబంలో పుట్టి, వారికుండే ఆస్తిలో సగం ఆస్తిని ప్రజలకు దారాదత్తం చేసిన ఉదారస్వభావం చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం నైజమని అన్నారు. ప్రజలకు విశిష్టమైన సేవలoదించడం, తప్పుచేసిన ఎంతటివారినైనా ప్రశ్నించడం వారి సొంతమని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించడమే వారు చేసిన తప్పా..? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఎటువంటి అరెస్టు వారెంట్లు లేకుండా, ముందు సమాచారం కూడా లేకుండా ఇంత దారుణంగా అర్ధరాత్రి గోడలు దూకి 200 మంది పోలీసులు ఇంట్లోకి తలుపులు పగలగొట్టి రావడం చాలా దారుణమైన చర్య ఆని అన్నారు.
ఆయనేమైనా ఉగ్రవాదా..? లేదా ఆర్ధిక నేరస్తుడా..? ప్రభుత్వ భూములను దోచుకొని దందాలు చేస్తున్నారా..? హత్యా రాజకీయాలు చేస్తున్నారా..? ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా దోచుకొని, సామాన్యులను సైతం బయబ్రాంతులకు గురిచేస్తున్న వైసిపీ నాయకులను ముందు అరెస్టులు చేయాలని డిమాండ్ చేసారు. వైసిపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నంలో భూ దందాలు ఎక్కువయ్యాయని అన్నారు. డ్రగ్స్, హత్యలు, బెదిరింపులు దారుణమైన స్థితిలో ఉన్నాయని చెప్పారు. వీటన్నిటిని కారణం వైసిపీలో ఉండే నాయకులేనని అన్నారు. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థo చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రజా విలువలను గౌరవిస్తూ, ప్రజలకోసం నిత్యం ఆలోచించే అయ్యన్నపాత్రుడు, రాజేష్ లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. అయ్యన్నపాత్రుడు, రాజేష్ లకు ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుందని గంటా నూకరాజు హెచ్చరించారు.