జాతీయ వార్తలు: పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్ (bathinda military station) లో కాల్పులు చోటు చేసుకున్న ఘటన ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటు చేసుకున్న ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బుదవారం తెల్లవారుజామున 4:35 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని అధికారులు సీజ్ చేసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.