కిడ్నాప్ చేసి.. ప్రైవేటు పార్ట్స్‌కి కరెంట్ షాకిచ్చారు

admin
By admin 602 Views
2 Min Read

ముగ్గురు యువకులను కిడ్నాప్ చేసిన ఓ ముఠా.. దారుణంగా హింసించారు. బట్టలు విప్పించి, బాధితుల మర్మాంగాలకు కరెంట్ షాక్‌ (electric shock to private parts) ఇచ్చి వేధింపులకు పాల్పడ్డారు. అత్యంత దారుణమైన ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో చోటుచేసుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు స్పందించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడి అనుచరులను చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారం చేస్తున్న అర్జున్‌ అనే వ్యక్తికి.. రమేశ్ అనే వ్యక్తి తనకు కారు కావాలని చెప్పడంతో మే 4న టెస్ట్‌ డ్రైవ్‌కు అర్జున్‌ ఒక కారును తీసుకెళ్లాడు.

Read Bharatshorts: 

AP EdCET 2024 Notification, Exam Pattern, Syllabus, Hall tickets and Free Online Mock Test

అర్జున్ తనతో పాటు తన ఇద్దరు స్నేహితులు సమీరుద్దీన్‌, అబ్దుల్‌ రెహమాన్‌లను కూడా తీసుకువెళ్లాడు. డబ్బులు ఎగ్గొట్టి, కారు కొట్టేయాలని ప్లాన్ చేసిన రమేశ్.. తన అనుచరులతో కలిసి అర్జున్ తో పాటు తన ఇద్దరు స్నేహితులని కిడ్నాప్ చేశాడు. ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పించి, వారి మర్మాంగాలకు విద్యుత్ షాక్ (electric shock to private parts) ఇచ్చి వేధించారు. వారిని నగ్నంగా వీడియోలు తీసి వదిలిపెట్టారు. కారును విక్రయించిన ప్రతిసారీ తమకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని, లేకుంటే ఈ వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.

- Advertisement -

Read:  Google Wallet India: ఇండియాలో గూగుల్ వాలెట్ సేవలు ప్రారంభం.. గూగుల్ పే సంగతేంటి మరి?

మే 5న రాత్రి 9.30 గంటల సమయంలో బాధితులు కలబురిగి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదే సమయంలో వారిని వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలించి మే 7న అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. నిందితులను రమేశ్, సాగర్, మమ్మద్ మథీన్ అలియాస్ స్టీల్ మథీన్, మహ్మద్ జియా ఉల్ హుస్సేన్, మహ్మద్ అఫ్జల్ షైక్, హుస్సేన్ షేక్‌లుగా గుర్తించారు. వీళ్లంతా ఓ పెద్ద గ్యాంగ్ అని, డబ్బుల కోసం దందాలు చేస్తుంటారని గుర్తించారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

/Web Stories/

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kayadu lohar Latest Pics Viral #kayadu_lohar