Bajaj Chetak C25 Electric Scooter: తక్కువ ధరలో కొత్త ఎంట్రీ-లెవల్ ఈ-స్కూటర్
భారతీయ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయమైన పేరుగా నిలిచిన Bajaj Auto ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న చేతక్ బ్రాండ్‌లో Bajaj Chetak C25 పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 91,399గా అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో గానీ, సమీపంలోని బజాజ్ షోరూమ్‌లో గానీ ఈ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇప్పటివరకు విడుదలైన చేతక్ ఎలక్ట్రిక్ మోడళ్లలో అతి తక్కువ ధరలో వచ్చిన స్కూటర్‌గా Chetak C25 నిలిచింది. రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ కస్టమర్ల కోసం ఈ మోడల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
Market Competition & Target Users of Chetak C25
Chetak C25 ప్రధానంగా సిటీలో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న Ola Electric Ola S1 X, Hero Moto Corp Vida VX2, TVS Motor Company Orbiter వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది ప్రత్యేకంగా పోటీగా నిలవనుంది.
Chetak C25 Battery Range & Charging Details
- Chetak C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.5kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు.
- ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 113 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
- గరిష్ట వేగం: గంటకు 55 కి.మీ.
- ఛార్జింగ్ టైమ్: 750W ఛార్జర్‌తో సుమారు 3 గంటలు 45 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ అవుతుంది.
Design & Look of Chetak C25
ఇప్పటికే ఉన్న చేతక్ వాహనాలకు ఉన్న క్లాసికల్ ఐడెంటిటీని కొనసాగించారు. రౌండ్ హెడ్‌ల్యాంప్, హ్యాండిల్ బార్‌లో అమర్చిన టర్న్ ఇండికేటర్లు, బాడీలో కలిసిపోయేలా డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్ వంటి సాధారణమైన ఫీచర్లు ఉన్నా ప్రీమియం ఫీల్ ఇచ్చే డిజైన్‌తో Chetak C25 ఆకట్టుకుంటుంది.
Chetak C25 Color Options & Smart Features
- ఈ స్కూటర్ ప్రస్తుతానికి ఆరు ఆకర్షణీయ రంగులైన గ్రీన్, వైట్, బ్లాక్, గ్రే, రెడ్, యెల్లో రంగులలో లభిస్తుంది
- ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా పోన్ కాల్, మెసేజెస్, నోటిఫికేషన్లు చూసుకోవచ్చు.
- అదనంగా టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Chetak C25 Safety & Additional Features
- కీతో కూడిన ఇగ్నిషన్ సిస్టమ్
- సీట్ కింద 25 లీటర్ల స్టోరేజ్
రివర్స్ అసిస్ట్
యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఇందులో అందించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే Bajaj Chetak C25 తక్కువ ధరలో, నమ్మకమైన బ్రాండ్ విలువతో, రోజువారీ వినియోగానికి సరిపడే రేంజ్‌తో ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఒక మంచి ఆప్షన్ గా ఉపయోగపడుతుంది.