Baby Movie Remuneration: కలెక్షన్లతో దూసుకెళ్తున్న బేబీ.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

admin
By admin 42 Views
2 Min Read

Baby Movie: బేబీ సినిమా వచ్చి వారం దాటినా ఇంకా అదే మత్తులో యూత్‌ ఊగిపోతున్నారు. కల్ట్‌ బొమ్మ అంటూ రివ్వూలు ఇచ్చేస్తున్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్​ ఆనంద్​ లీడ్​ రోల్స్​లో రూపొందిన ఈ చిత్రం గురించే ఇప్పుడు నెట్టింట టాక్​ నడుస్తోంది. ‘కలర్‌ఫోటో’ ఫేమ్​ సాయి రాజేశ్​ దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా జులై 14న థియేటర్లలో రిలీజైంది. ఓ వైపు జోరుగా వానలు పడుతున్నా.. మరో వైపు బేబితో హాల్స్‌ నిండుగా కనిపిస్తున్నాయి. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా బేబి సినిమా పరుగులు పెడుతుంది.

Baby Movie Collections: తొలి రోజే రూ.7.1 కోట్లు వరకూ కలెక్షన్స్‌ వసూలు​ చేసిన ఈ సినిమా.. రెండో రోజు రూ. 7.2 కోట్లు రాబట్టి.. మంచి టాక్​తో దూసుకెళ్లింది. అలా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు సాయిరాజేష్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇప్పటి కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సినిమాగా బేబీ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. సుమారు 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ‘బేబి’… మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి లాభాల్లోకి ఎంట్రీ అయినట్లు ట్రేడ్​ వర్గాల టాక్​. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బేబీ సినిమా ఓవరాల్ గా 65-70 కోట్ల గ్రాస్ వసూల్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు గుసుగుసలాడుతున్నాయి​.

Baby Movie Remuneration: ఇప్పటి కాలంలో తక్కువ బడ్జెట్​తో తెరకెక్కి కోట్లు రాబట్టిన ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా టాక్​ ఆఫ్​ ద టౌన్​గా మారింది. అయితే తాజాగా ఇందులోని సినిమా స్టార్స్ రెమ్యూనరేషన్​ విషయం గురించి నెట్టింట ఓ వార్త హల్​ చల్​ చేస్తోంది. అదేంటంటే.. హీరో ఆనంద్‌ దేవరకొండ ఈ సినిమా కోసం రూ.80 లక్షల మేర పారితోషకాన్ని అందుకున్నారట. ఇక హీరోయిన్‌ వైష్ణవి చైతన్య రూ.30లక్షలు.. మరో హీరో విరాజ్‌ రూ.25 లక్షల వరకు తీసుకున్నారట. అయితే దర్శకుడు సాయి రాజేష్​ మాత్రం ఈ సినిమా కోసం కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారట.

/ Web Stories /

Share this Article
Leave a comment
Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar