వైభవంగా అనంత పద్మనాభుని పెళ్ళిరాట మహోత్సవం

admin
By admin 22 Views
1 Min Read

Anantha Padmanabha Swami Kalyanam

విశాఖపట్నం: మండల కేంద్రమైన పద్మనాభంలో వెంచేసియున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పెళ్లిరాట మహోత్సవం ( Anantha Padmanabha Swami Kalyanam) ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్చి రెండవ తేదీ నుంచి నిర్వహించనున్న అనంత పద్మనాభుని కళ్యాణోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం పెళ్లి రాట కార్యక్రమాన్ని నిర్వహించి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆలయంలోని అనంత పద్మనాభుని ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు చేసిన అనంతరం పూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ చేశారు. వేద పండితులు విస్వేక్షణ పూజ పుణ్యాహవాసనం, గణపతి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కొమ్ములు వేసి మహిళలు పాటలు పాడుతూ రోకలితో పసుపు దంచారు. అనంతరం పెళ్లి రాటను వేసి కల్యాణోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు, ఆలయ ఈవో నానాజీ బాబు, ఏపీ బీజేపీ మెడికల్ విభాగం కన్వీనర్ రూపకుల రవికుమార్, పద్మనాభం సర్పంచ్ టీ పాప (పద్దు) ఎంపీటీసీ కే లక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share this Article
Leave a comment