ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని (ap govt Schemes) ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే గరుడ పథకం. చాలా మందికి “గరుడ స్కీమ్ (AP Govt Garuda Scheme Complete Details)” అని పేరు వినగానే ఇది jobs స్కీమ్ ఆ? డబ్బులు ఇస్తారా? ఎవరికీ వస్తుంది? అనే డౌట్స్ వస్తుంటాయి. మీ సందేహాలు అన్ని ఇక్కడే తెలుసుకోండి.
What is Garuda Scheme in Andhra Pradesh? గరుడా స్కీమ్ అసలు ఏంటి?
గరుడ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద బ్రాహ్మణ కుటుంబాల కోసం తీసుకొచ్చిన ఒక ఆర్ధిక సహాయ పథకం. ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరికైనా మరణం సంభవించినప్పుడు ఆ సమయంలో అంత్యక్రియలకు, ఇతరత్రా అయ్యే ఖర్చు చాలా మందికి భారంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో కుటుంబానికి తక్షణ సహాయం అందించడానికి ప్రారంభించినదే ఈ గరుడా స్కీమ్.
Garuda Scheme amount details AP(ఈ స్కీమ్ ద్వారా ఎంత డబ్బు ఇస్తారు)?
ఈ స్కీమ్ ద్వారా అర్హులైన బ్రాహ్మణులకి ఒక్కసారి ₹10,000/- ఆర్థిక సహాయం ఇస్తారు. ఈ డబ్బులు అంత్యక్రియల ఖర్చులకు మరియు అందుకు అవసరమైన ఖర్చులకు ఉపయోగపడేలా ఇస్తారు.
Who is eligible for Garuda Scheme AP (ఎవరికీ గరుడా స్కీమ్ వస్తుంది)?
ఈ స్కీమ్ అందరికీ కాదు. కింది అర్హతలు ఉన్నవాళ్లకే వస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాళ్లు అయి ఉండాలి.
- బ్రాహ్మణ వర్గానికి చెందిన కుటుంబం అయి ఉండాలి.
- కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి. (ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి లోపల)
- కుటుంబంలో మరణం జరిగిన వ్యక్తి బ్రాహ్మణుడై ఉండాలి.
- దరఖాస్తు చేసే వ్యక్తి అతని/ఆమె సమీప బంధువు అయి ఉండాలి. (భార్య, భర్త, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె)
ముఖ్యమైన విషయం ఏంటంటే మరణం జరిగిన తర్వాత 45 రోజుల్లోగా ఈ పథకానికి అప్లై చేయాలి.
Also Read:
NTR Housing Scheme -2026: ఎన్టీఆర్ హౌసింగ్–ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కీలక అప్డేట్
Loans without Interest: వడ్డీ లేకుండా లోన్ ఎలా సాధ్యం? చాలామందికి తెలియని నిజాలు
Garuda Scheme documents required Telugu (గరుడా స్కీమ్‌కి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి)?
సాధారణంగా ఇవి అవసరం పడతాయి:
- ఆధార్ కార్డు
- మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్ వివరాలు
- నివాస ధృవీకరణ
How to apply Garuda Scheme in Andhra Pradesh (గరుడా స్కీమ్ ఎలా అప్లై చేయాలి)?
ప్రభుత్వం ఈ స్కీమ్‌ని సాధారణంగా సచివాలయాలలో లేదా ఆన్‌లైన్ విధానంలో అమలు చేస్తుంది. సాధారణ అప్లై విధానం ఇలా ఉంటుంది:
1. దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్లాలి
2. గరుడా స్కీమ్ అప్లికేషన్ అడగాలి
3. అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలి
4. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
5. అప్రూవ్ అయిన తర్వాత డబ్బు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది
మీ కుటుంబానికి లేదా మీకు తెలిసిన వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ స్కీమ్ గురించి తప్పకుండా తెలియజేయండి.
తాజా ప్రభుత్వ నోటిఫికేషన్లు, అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉండండి.