ప్రస్తుత బంగారం ధరలు (Gold Rates) రికార్డు స్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే బంగారం ధరలు గణనీయంగా (Gold Price Drop) తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి (market analysts says). అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో అమెరికా తన అమ్ముల పొదిలో నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని బయటకు తీసింది. అదే మార్జిన్ హైకింగ్ (Margin Hiking).
చైనా విపరీతంగా బంగారాన్ని కొంటూ డాలర్ సామ్రాజ్యాన్ని పడగొట్టేందుకు సవాలు చేస్తున్నటువంటి తరుణంలో అమెరికా వేసినటువంటి ఈ ఎత్తుగడ పసిడి పరుగులకు బ్రేక్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1980 & 2011లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణలు. సాదారణంగా బంగారపు ధరలు ఎందుకు పెరుగుతాయో మనకు తెలుసు కానీ అమెరికా అనుకుంటే ఆ ధరలు ఒక్క రాత్రిలో కుప్ప కూల్చగలదని మీకు తెలుసా?
ప్రస్తుతం చైనా తన ఖజానాను బంగారంతో నింపుకుంటూ అమెరికా డాలరును భయపెడుతుంది. ఈ తరుణంలో చికాగో మర్చెంట్ ఎక్స్చేంజ్ (chicago merchant exchange) లో మార్జిన్ హైక్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది అమెరికా. అసలు ఈ మార్జిన్ హైక్ అంటే ఏంటి? 1980 మరియు 2011 లో దీనివల్ల బంగారపు యొక్క ధరలు ఎలా పడిపోయాయి? ఇప్పుడు పసిడి యొక్క పరిస్థితి ఏంటి? అనే విషయాలు చూద్దాం.
ఏమిటి మార్జిన్ హైకింగ్ (What is Chicago Merchant Exchange)
స్టాక్ మార్కెట్ (Stock Market) లో లేదా గోల్డ్ ట్రేడింగ్ (Gold Trading) లో ఎవరైనా బంగారం కొనాలంటే మొత్తం డబ్బు కట్టాల్సినవసరం లేదు. కొంత మార్జిన్ను కట్టి పెద్ద మొత్తంలో వ్యాపారం చేయవచ్చు. కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ ఈ మార్జిన్ ధరను పెంచేస్తుంది. దీంతో నిన్నటి వరకు 100 రూపాయలు కట్టి వ్యాపారం చేసినవాడు నేడు 200 రూపాయలు కట్టి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇంత డబ్బు లేని ట్రేడర్లు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు ఒక్కసారిగా పడిపోతాయి.
1980’s silver thread & downfall of Hunt Brothers
1980 నాటి సిల్వర్ త్రెడ్ (1980’s silver thread) ఇక హంట్ బ్రదర్స్ పతనం (downfall of Hunt Brothers) కూడా ఒకసారి మనం గమనించాలి. 1980 లో హంట సోదరులు ప్రపంచంలోని వెండినంతటిని కొనేసి ధరలను ఆకాశాన్ని తీసుకెళ్ళాలని చూశారు. అప్పుడు అమెరికా ఎక్స్చేంజ్ మార్జిన్లను భారీగా పెంచేసింది. ఫలితంగా వెండి బంగారం యొక్క ధరలు కుప్పకూలాయి. ఒక్క రాత్రిలో బిలియన్ల సంపద ఆవిరైపోయింది.
2011లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 1900 డాలర్లకు చేరింది. అప్పుడు కూడా చికాగో మర్చెంటైల్
ఎక్స్చేంజ్ ఏకంగా మూడు రోజుల్లో రెండు సార్లు మార్జిన్లను పెంచింది. దీంతో అతికొన్ని రోజుల్లోనే బంగారం ధర 15 శాతానికి పైగా పడిపోయింది.
ప్రస్తుతం చైనా తన విదేశీ నిల్వలను డాలర్ల నుంచి బంగారానికి మారుస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే చైనా కొంటున్నటువంటి బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు ధరలను అదుపులో ఉంచేందుకు అమెరికా ఈ మార్జిన్ అస్త్రాన్ని వాడుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా గతంలో వలె బంగారం రెట్లు గణనీయంగా తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాదారణంగా మార్జిన్లను పెంచినప్పుడు తాత్కాలికంగా ధరలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేసి బయటకి వచ్చేస్తారు.
అయితే భారత్, చైనా వంటి దేశాలు ఫిజికల్ గోల్డ్ ను అత్యధికంగా ఉపయోగితున్నాయి. కాబట్టి బంగారం ధరలు 2011 లాగా భారీగా పడిపోతాయా లేక కొంచెం మాత్రమే తగ్గి చిన్న బ్రేక్ తీసుకుంటాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చైనా పంతం నెగ్గుతుందా లేక అమెరికా మార్జిన్ మాయాజాలం పసిడిని కిందకు దించుతుందా అనేది వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి.