Loans without Interest: వడ్డీ లేకుండా లోన్ ఎలా సాధ్యం? చాలామందికి తెలియని నిజాలు

admin
By admin
195 Views
2 Min Read

ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోయినా పరవాలేదు, అప్పు లేకపోతే చాలు. ఎవరిదగ్గరైన అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ భారం తప్పదు. ప్రస్తుత దశాబ్ద కాలంలో ఆన్లైన్ లోన్స్ (online loans) ఎక్కువయ్యాయి. సాదారణంగా అప్పు తీసుకుంటే వడ్డీ ఎక్కువని అనుకుంటారు. కానీ వడ్డీ లేని లోన్స్ (Loans without Interest) కూడా ఉన్నాయని తెలుసా? వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ కార్డులు(Credit Cards)

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగం విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ క్రెడిట్ కార్డులను (Credit Cards)సరిగ్గా వాడితే మీకు వడ్డీ లేని లోన్ (Loans without Interest) వచ్చినట్లే అనే విషయం కొద్దిమందికే తెలుసు. అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డుతో ఏదైనా వస్తువు కొంటే మీరు ఎంత ఖర్చు చేశారో అంతే మొత్తం బిల్ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇది వడ్డీ లేని రుణమే కదా. వీటికి గరిష్టంగా 50 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 50 రోజుల్లో వాడుకున్న అమౌంట్ తిరిగి చెల్లిస్తే వడ్డీ చెల్లించనవసరం లేనట్లే.

నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI)

చాలా వరకు ఈ కామర్స్ సంస్థలు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ లేదా ఇతర గాడ్జెట్స్ పై నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) అందిస్తుంటాయి. ఇది కూడా ఒక రకమైన వడ్డీ లేని లోన్ అని చెప్పొచ్చు. కొనుగోలు చేసిన వస్తువుకి తీసుకున్న నెలల్లో నో కాస్ట్ ఈఎంఐ తో చెల్లించినట్లైతే ఇక్కడ కూడా మీరు వడ్డీ లేని లోన్ను పొందినట్లే. ఇలాంటి ఆఫర్లు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీస్ వసూలు చేయొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి.

Buy Now Pay Later (BNPL)

చాలా వరకు ఈ కామర్స్ సంస్థలు తమ యొక్క నమ్మకమైన కస్టమర్లకు బై నౌ పే లేటర్ (Buy Now Pay Later) సర్వీసులను అందిస్తున్నాయి. వాటి ద్వారా వస్తువులను కొనుక్కున్నట్లితే సంబందిత సంస్థలు నెల రోజులు వరకు వడ్డీ లేకుండా సర్వీసులను అందిస్తున్నాయి. కాకపోతే కొన్ని సంస్థలు సర్వీసు ఫీజును లేదా పోసేస్సింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి.

Compay Loans for Employes

కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలని అందిస్తుంటాయి. ఉద్యోగుల ఇంటి నిర్మాణం పిల్లల చదువులు లేదా అత్యవసర ఖర్చులకు కంపెనీలు వడ్డీ లేకుండా లోన్స్ లేదా అడ్వాన్సులు ఇస్తాయి. అయితే అన్ని కంపెనీలో ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.

Central Govt Schemes

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వృత్తి పనులు చేసుకునే వారికి, పేదల కోసం ప్రత్యేక పథకాల ద్వారా (పీఎం విశ్వకర్మ, MSME లాంటి సంబందిత పథకాలు) వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి. అయితే ఈ పథకాలు ద్వారా లోన్స్ రావాలంటే కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఇలాంటి వాటి ద్వారా వడ్డీ లేకుండా లోన్స్ పొందొచ్చు. ఇలాంటి లొన్స్ అన్నీ సరైన సమయంలో, సరైన విధంగా వాడితే తప్పకుండా లాభం ఉంటుంది. లేకపోతే వడ్డీ లేని లోన్ కూడా కొన్నిసార్లు భారంగా మారుతుంది.

Share This Article
Leave a Comment