Iran Protests Turn Violent: 538 Deaths, US Military Action Warning

admin
By admin
127 Views
2 Min Read

ఇరాన్‌లో కొనసాగుతున్న mass protests ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో global headlines అవుతున్నాయి. నిరసనలతో దేశం అట్టుడుకుతుండగా, ఆందోళనకారులపై సైన్యం కఠిన చర్యలు తీసుకుంటోంది. అధికార లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 538కి చేరింది. ఇందులో 48 మంది security personnel కూడా ఉన్నారు. దాదాపు 10,670 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇరాన్‌ వీధులు హింసతో నిండిపోవడంతో Middle East tensions మరింత పెరుగుతున్నాయి.

ఇదే సమయంలో United States ఇరాన్‌పై military action అవకాశాలను సీరియస్ గానే పరిశీలిస్తోందన్న వార్తలు West Asia మొత్తం కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

US–Iran మాటల యుద్ధం

ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము ఊరుకునేది లేదని అమెరిక అధ్యక్షుడు Donald Trump హెచ్చరిస్తున్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన Truth Socialలో ఆయన “ఇరాన్ ప్రజలు freedom కోసం పోరాడుతున్నారు, వారికి అమెరికా అండగా ఉంటుంది” అని పోస్ట్ చేయడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. అమెరికా media reports ప్రకారం, సైనికాధికారులు ఇప్పటికే ట్రంప్‌తో చర్చలు జరిపారు. ఇరాన్‌పై direct action కాకుండా indirect intervention వంటి పలు ఆలోచనలు ఆయన ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే మృతుల సంఖ్య మరింత పెరిగితే strong action తప్పదని స్పష్టం చేస్తున్నారు.

ఇరాన్ ప్రభుత్వం ఘాటు వాఖ్యలు

ఇరాన్ అధ్యక్షుడు Masoud Pezeshkian ఆందోళనకారులను ఉగ్ర మూకలుగా అభివర్ణించారు. వీరు సమాజాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నాయన్న ఆరోపణలూ ఆయన చేశారు.

దాడి చేస్తే ఇజ్రాయెల్ లక్ష్యం

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ Mohammad Bagher Ghalibaf మాట్లాడుతూ, అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే తాము Israelను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ప్రతీకారం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio, ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahuతో ఫోన్‌లో చర్చించారు. ఇరాన్ నిరసనలు, గాజా, సిరియా పరిస్థితులపై మాట్లాడినట్లు సమాచారం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని రూబియో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

ఇరాన్‌లో మొదలైన ఈ anti-government protests ఇప్పుడు విదేశాలకు కూడా విస్తరించాయి. Londonలోని ఇరాన్ ఎంబసీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు ఎంబసీ బాల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించి, 1979కి ముందు జాతీయ జెండాను ఎగురవేశారు.
అలాగే Paris, Berlin సహా యూరప్‌లోని ప్రధాన నగరాల్లో solidarity rallies నిర్వహించారు.

ఇదంతా చూస్తుంటే ఇరాన్ నిరసనలు ఇప్పుడు కేవలం దేశీయ సమస్యగా కాకుండా global crisisగా మారుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, Middle East stabilityపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share This Article
Leave a Comment