విశాఖపట్నం: గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పిడుగు పడి ఓ యువకుడు మృతి (Lightning Death) చెందినా ఘటన చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలానికి చెందిన అల్లి సతీష్ ఎల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శనివారం గొర్రెలను మేత కోసం గ్రామ సమీపంలోకి తోలుకువెళ్లాడు. గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజులు పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని.. రైతులు, పశువులు కాపర్లు, బయటకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.