విశాఖపట్నం: పద్మనాభంలో కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి (Padmanabha swami Temple) వారి దేవాలయంలో రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 4గం.లకు స్వామివారికి పంచామృత అభిషేకాలు, అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అదేవిదంగా ఈనెల 14న అనగా శనివారం ఉదయం 7 గం. లకు స్వామి వారు, అమ్మవారు గోస్తనీ నదికి నీలాటి ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు గోదా రంగనాయక స్వామి వారి శాంతి కల్యాణం మరియు 11:30 గంటలకు తీర్ధప్రసాదాల వితరణ మొదలైన కార్యక్రమాలు చేపట్టనున్నారు.