ఆంధ్రప్రదేశ్: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి (Ayyanna Patrudu)ని సీఐడీ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. అయ్యన్న తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని అయ్యన్న పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశముంది. గతంలో ఇంటి గోడ కూల్చివేత విషయంలో అయ్యన్న పాత్రుడు కోర్టుకు నకిలీ పత్రాలు సమర్పించారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తిఔకున్నరు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు సెక్షన్ 50ఏ ప్రకారం నోటిసులు ఇచ్చి తండ్రి కొడుకులను అరెస్ట్ చేసారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు.