దారుణం.. దొంగతనం చేశాడనే అనుమానంతో ట్రాన్స్‌పోర్టు మేనేజరుని కొట్టి చంపేసారు

admin
By admin 422 Views
1 Min Read

Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar pradesh) లోని షాజహాన్‌పూర్‌లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్‌పోర్టులోని  వస్తువులను దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ను స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డుతో తీవ్రంగా చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. దీంతో దెబ్బలకు తట్టుకోలేక అతడు ప్రాణాలు కోల్పోయాడు. బంకిం సూరి అనే వ్యక్తి కొన్నేళ్లుగా రవాణా వ్యాపారం చేస్తున్నాడు. ఇతని దగ్గర శివమ్ జోహ్రీ (32) గత ఏడేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వ్యాపారి కొన్ని వస్తువులను వేరే వారికి ట్రాన్స్‌పోర్టు చేశాడు. అయితే.. వీటిలో కొన్ని వస్తువులు కనిపించకుండా పోయాయి. దీంతో ఆగ్రహానికి గురైన సూరి అనుమానంతో ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేసే ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. వ్యాపారి మాట మేరకు అతని మనుషులు శివమ్‌ను స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆ తరవాత అతని మృతదేహాన్ని షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి బయట పడేసి వెళ్లిపోయారు. మృతదేహాంపై ఉన్నగాయాలను పరిశీలించిన పోలీసులు హత్య ఘటనగా (Crime News) అనుమానించారు. ఈ క్రమంలోనే శివమ్‌ను రాడ్డుతో చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా బంకిం సూరి, వేరొక ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని అయిన నీరజ్‌ గుప్తాతో సహా మరో ఐదుగురిని నిందితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

/ Web Stories /

Share this Article
Leave a comment
Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar