జూలై 2న సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ

admin
By admin
642 Views
1 Min Read

విశాఖపట్నం: జులై 3వ తేదీన ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి గిరి ప్రదక్షిణ (Simhachalam Giri Pradakshina) జులై 2న నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి. త్రినాథరావు తెలిపారు. గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ సుజాత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, సహాయ కార్య నిర్వహణ అధికారులు తదితరులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా దేవాలయంలో జరుగు వైదిక కార్యక్రమాలు అయిన శ్రీ స్వామివారి పుష్పరథం, గిరి ప్రదక్షిణ ప్రారంభం, పుష్పరథం సిద్ధం చేయడం, స్వామివారి అలంకరణ, పుష్పరథం, ప్రధాన దేవాలయం ప్రత్యేక పుష్పాలంకరణలు, రథం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, కొండ చుట్టూ స్టాల్స్ ఏర్పాటుపై చర్చించారు.

పుష్పక రథము తిరుగు మార్గంలో సర్వీస్ వైర్లు తొలగించడం, తాగునీరు, పారిశుధ్యం, వాల్ పోస్టర్స్ ప్రభుత్వ శాఖల వారికి లేఖల వ్రాయుట, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు విశ్రాంతి మండపంలో ఏర్పాటు చేయుట క్యూలైన్లు, భక్తుల దర్శనం గురించి మంచినీటి ఏర్పాటు, ఉచిత ప్రసాదము వితరణ వంటి వాటిపై చర్చించారు. ఆలయధర్మకర్తల సభ్యులు గంట్ల శ్రీనుబాబు, పిల్లా జగన్మోహన్ పాత్రుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment