విశాఖపట్నం/ robbery in visakhapatnam: బుచ్చయ్య పేట మండలం కోమలపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోరీ (robbery in visakhapatnam) జరిగింది. 13తులాల బంగారం తో పాటు 18 500 వేలు నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బుచ్చయ్య పేట ఎస్ ఐ కుమార్ స్వామి అందించిన సమాచారం మేరకు.. కోమలపూడి గ్రామానికి చెందిన పాము రాము ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారు ఆయనకి అత్త వారి ఇంటి దగ్గర వ్యవసాయం ఉండడంతో రాము అతని భార్య మంగళవారం ఉదయం వ్యవసాయ పనులు నిమిత్తం గాదిరాయి వెళ్లిపోయారు. వారు ఇంటి దగ్గర లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి అలమర లో ఉన్న ఇంటి తాళం తీసి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న మూడున్నర తులాల తాడు నక్లీస్, ముడుతలాలు చెవి రింగులు, తులం ఎత్తు గొలుసులు, తులం చైను, రెండు తులాలు ఉంగరం, తులం బొట్లు తులం.. మొత్తం 13 తులాల బంగారం 18 తులాల వెండి పట్టీలు. మొత్తం 36 తులాల వెండి 18,500 నగదు చోరీకి గురయ్యాయి.
robbery in visakhapatnam
రాము కుమారుడు స్కూల్ నుంచి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చే చూసి సరికి ఇంటి తలుపులు తీసి బీరువాలో బట్టలు బయట ఉండటం గమనించి వెంటనే తండ్రి రాముకి ఫోన్ చేయగా రాము హటావోటిన వచ్చి ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించారు. స్థానిక ఎస్సై కుమారస్వామికి సమాచారం అందించడంతో ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు.