Train Accident: రైలు ప్రమాదంపై మతం రంగు.. హెచ్చరించిన పోలీసులు

admin
By admin 702 Views
2 Min Read

జాతీయ వార్తలు: మూడు రైళ్లు ఢీకొని (Train Accident) ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో సుమారు 275 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ హృదయ విదారక ఘటనపైనా కొంతమంది మతం మరకలు అంటిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి ఓ మతం కారణమనే విధంగా అర్థం వచ్చేటట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టులకు లైక్‌లు, షేర్లు రావడంతో వైరల్‌గా మారాయి. ఘటన జరిగింది శుక్రవారం అని.. ఆ రోజు ఒక మతానికి పవిత్రమైన రోజు అని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ప్రమాద స్థలానికి పక్కనే ఓ మతానికి చెందిన భవవనం ఉందని పోస్టులు పెడుతున్నారు. అనుకూల, వ్యతిరేక పోస్టులతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు (Train Accident):
ఒడిశా ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులపై ఆ రాష్ట్ర పోలీసులు స్పందించారు. అదంతా ఒక అసత్య ప్రచారం అని తేల్చారు. సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నట్లుగా ఘటనాస్థలానికి పక్కన ఉన్న భవనం ఆ మతానికి సంబంధించింది కాదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరైనా మత పరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ఒడిశా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడం, ఆ రకంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇలాంటి దుర్ఘటనపై అసత్య, చెడు ప్రచారంతో చేస్తున్న పోస్టులను షేర్ చేయవద్దని ప్రజలకు సూచించారు.

 

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *