Ind vs Ban: తొలి సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్.. భారత్‌ స్కోరు 162/1

admin
By admin 2 Views
1 Min Read

Ind vs Ban: భారత్‌-బంగ్లా మధ్య జరుగుతోన్న మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ధావన్‌, ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (107*) అదరగొట్టేశాడు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని మరీ శతకం బాదేశాడు. ఇషాన్‌ 85 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (46*) ఇషాన్‌కి మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలో అర్ధశతకం వైపు దూసుకొస్తున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *