AP ELECTION SURVEY 2024: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇవే..

admin
By admin 15 Views
2 Min Read

ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి రేపు ఎలక్షన్లు, ఓట్లు ఏ విధంగా రాబోతున్నాయి అనే అంశం మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సర్వేలు (survey) ప్రారంభించాయి. రైజ్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్తే జగన్ ప్రభుత్వం వస్తుంది. కానీ 2024 ఎన్నికల (ap elections 2024) కు వెళ్తే మాత్రం వైసిపి ఓడిపోతుంది అని, 2024లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి 45.86 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీ 41.31 శాతానికి పరిమితం అవుతుందని, జనసేన 8.92 శాతానికి పెరుగుతుందని, బిజెపి 0.53 శాతానికి పడిపోతుందని, కాంగ్రెస్ 0.92 శాతానికి పెరుగుతుందని, ఇండిపెండెంట్ లు ఇతరులు 2.64 శాతానికి పడిపోతారని లెక్క కట్టారు.

డిసెంబర్ 2023 (ap elections2023)లో ఎన్నికలు జరిగితేనే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2024 లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన కలిపి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కేవలం బిజెపితో మాత్రమే జనసేన పొత్తు కలుపుకుంటే మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. మే 2024 ఎన్నికల విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన పాత్ర పోషించబోతుందని తెలుస్తుంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీ పడినా, లేట్ చేసినా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం మెండుగా ఉంటుందని వీళ్ళ సర్వే  ఇచ్చిన ఒక లెక్క. 2024 లో ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 61 నుండి 70 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని, తెలుగుదేశం పార్టీ 85 నుండి 95 స్థానాలకీ, జనసేన పార్టీ  7 నుండి 10 సీట్లకి వచ్చే అవకాశం ఉందని 31 స్థానాల్లో హోరాహోరీగా ఉంటుందని లెక్కవేశారు.

ఈ జిల్లాల్లో వైసీపీ అసలు బోణీయే కొట్టదట

విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి అసలు బోణీయే కొట్టదని, పార్వతీపురం, మన్యం, కడప, నంద్యాలలో టిడిపికి ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదని, విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి, కృష్ణ, తిరుపతి జిల్లాలో తప్ప మిగిలిన చోట జనసేనకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం  లేదని  చెప్తున్నారు.

Share this Article
Leave a comment