విశాఖ: మండల కేంద్రమైన పద్మనాభం (padmanabham) గిరిపై కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి (Anantha padmanabha Swamy) వారి జయంతి ఉత్సవాలు పద్మనాభంలో శనివారం ఘనంగా జరిగాయి. స్వామి వారి మూలమూర్తికి ఆలయ పురోహితులు విశేష పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. కొండ దిగువన ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయంలో రెండు విడతలుగా స్వామివారి వ్రతాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో కొండపైన ఉన్న అనంత పద్మనాభ స్వామి, కొండ దిగువున ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఉత్సవాలలో ఎంపీపీ కె.రాంబాబు, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేసారు.