నేడు నగరానికి రానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

admin
By admin 3 Views
1 Min Read

Visakhapatnam: మాజీ ఉపరాష్ట్రపతి ( former vice president of India) ముప్పవరపు వెంకయ్యనాయుడు ( muppavarapu venkaiah naidu ) సోమవారం నగరానికి రానున్నారు. సాగర్‌నగర్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరుగుతున్న మహిళా ఎమ్మెల్యేల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 12.30 గంటలకు రాడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సదస్సుకు హాజరవుతారు. 4.15 నుంచి 4.45 గంటల వరకు సదస్సుకు హాజరైన మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించి, వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అనంతరం పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఈ నెల 7న ఉదయం 9.25 గంటలకు మధురవాడ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం సమీపంలోని గ్రీన్‌డేల్‌ స్కూల్‌లో వాకథాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం సాగర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకుంటారు. ఈ నెల 9న ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, అక్కడి నుంచి 8.25 గంటలకు రైల్వేస్టేషన్‌కు బయలుదేరి, రాజమండ్రి మీదుగా మాజీ ఉపరాష్ట్రపతి (former vice president of India) ఏలూరు వెళ్తారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *