Today Horoscope: నేటి రాశి ఫలితాలు 08-04-2023

admin
By admin 5 Views
2 Min Read

Today Horoscope: నేటి రాశి ఫలితాలు 08-04-2023

మేష రాశి:

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాటవిలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

వృషభ రాశి:

అర్థలాభం ఉంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి.రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మిధున రాశి:

ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకోవడం మంచిది.

కర్కాటక రాశి:

ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది.ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.

సింహ రాశి:

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

కన్య రాశి:

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

తులా రాశి:

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి.ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.  ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకం చదవాలి.

ధనుస్సు రాశి:

మనఃస్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

మకర రాశి:

మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.

కుభ రాశి:

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

మీన రాశి:

ధర్మసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, సమర్ధంగా వాటిని ఎదుర్కొంటారు. మౌనం వహించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సూర్యధ్యానం శుభప్రదం.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *