విశాఖపట్నం: మండల కేంద్రమైన పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ( Anantha Padmanabha Swami) వారి కొండమెట్ల దీపోత్సవం ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు కొండ దిగువనున్న కుంతి మాధవ స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం గోడ పత్రికలు ఆవిష్కరించారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులు విజయనగరం నుండి వచ్చిన వారు ఎం.ఆర్ కాలేజీ తోట వద్ద, సింహాచలం వైపు నుండి వచ్చేవారు బోన్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఎంపీపీ రాంబాబు, సర్పంచ్ తాలాడ పాప (పద్దు), కోరాడ లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.