visakhapatnam/విశాఖపట్నం: మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్చార్జ్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరగనున్న ప్రధాని సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు కొట్టగులి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, అదీప్ రాజ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీలు వరుది కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, చైర్మన్లు కేకే రాజు, అక్కరమని విజయనిర్మల, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.