నేటి రాశి ఫలాలు (27 Oct 2022)

admin
By admin 4 Views
3 Min Read

మేషం:

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి
వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృషభం:

ఆదాయం మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిధునం:

కీలక వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

కర్కాటకం:

ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు
వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.వృధా ఖర్చులుంటాయి.

సింహం:

వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట
పట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య:

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభాకార్య విషయాలలో చర్చలు చేస్తారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.

తుల:

మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

వృశ్చికం:

వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనస్సు:

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు.
ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన
మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

మకరం:

ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు.

కుంభం:

పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు ముఖ్యమైన పనులలొ అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

మీనం:

చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *