80 ఏళ్ల చంద్రమోహన్‌ గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు.

కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించారు.సినిమా రంగంపై ఆసక్తితో చెన్నై వెళ్లి అవకాశాలకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 1966లోవచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రంతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

తొలుత కామెడీ మరియు నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తూ.. ఆపై హీరోగా ప్రమోషన్ అందుకున్నారు. అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. ఈ క్రమంలో పలు తమిళ సినిమాల్లోనూ నటించిన చంద్రమోహన్ చివరిగా గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సిజన్’ చిత్రంలో కనిపించారు. 

తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 400లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు సైతం అందుకున్నారు.

తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 400లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు సైతం అందుకున్నారు.

చంద్రమోహన్ మృతికి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ తదితరులు ఎక్స్ ద్వారా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.