NTR30  మంచి స్పీడ్‌ మీదున్న తారక్‌..  భారీ ఫైట్‌ సీన్‌తో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి

ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో NTR30 సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి

ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్‌లో ఓ భారీ ఫైట్‌ సీన్‌ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ షెడ్యూల్‌ తొమ్మిది రోజుల పాటు జరిగిందట.

ఏప్రిల్‌ చివరి వారంలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు.

యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్‌.

ఆచార్య’తో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్‌ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సెకండ్ సినిమా చేస్తున్న కొరటాల శివ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు.

రాజమౌళితో సినిమా చేస్తే దని తర్వాత ఆ హీరో ఏ దర్శకుడితో సినిమా చేసినా అది ఫ్లాప్ అవుతుంది అనే నమ్మకం తెలుగు ఆడియన్స్ లో ఉంది. చూడాలి మరి ఈ సేన్తిమేన్తుకి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో..?

ఈ కథ ఒక కోస్టల్ ల్యాండ్ నుంచి తీసుకున్నామని అక్కడ ఉండే మనుషులకు దేవుడంటే భయం లేదు, చావంటే భయం లేదు కానీ వాళ్లు మాత్రం ఒకదానికి మాత్రమే భయపడతారు అది ఎవరికి అనేది ఈ సినిమా నేపథ్యం అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు.