Must Visit Best  Five Places in 

INDIA

BHARAT SHORTS

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉండే రన్ ఆఫ్ కచ్ ఉప్పుతో నిండిన చిత్తడి ఎడారి ప్రాంతం. ఇది భారత్, పాకిస్థాన్ దేశాల్లో సుమారు 30 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడంతో ఈ ప్రాంతం మొత్తం తెల్లగా కనిపిస్తుంది. కనుచూపు మేరలో మీకు భూమి అనేదే కనపడదు. దీంతో అక్కడ మీరు విహరిస్తే కొత్త ప్రపంచంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.

rann of kutch

పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల నడుమ ఉన్న సుందర్బన్స్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులకు నిలయం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గానూ గుర్తింపు పొందడంతో తప్పక చూడాల్సిందేనని చెప్పొచ్చు.

sundarban forest

ఈ మడ అడవులకు పడవలో వెళ్లి తీరాలే కానీ అత్యద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు. అలాగే ఇక్కడ అనేక బెంగాల్ పులులు, మొసళ్లు వంటి అనేక జంతువులను కూడా చూడొచ్చు.

sundarban forest

లద్ధాఖ్‌ ప్రాంతంలోని జంస్కార్ వ్యాలీ మరో అద్భుతమైన ప్రదేశం. ఇది కార్గిల్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడికి వెళ్లే పర్యాటకుల  సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇది లద్ధాఖ్ ప్రాంతంలో దాగిన రత్నం అని చెప్పుకోవచ్చు.

zanskar valley

అక్కడ ఉండే హిమాలయాలు మంచుతో నిండి ఉండటంతో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. అలాగే ఆ పర్వతాల చెంత ప్రవహించే నదీ జలాల అందాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది.

zanskar valley

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న సతత హరిత అడవుల్లోని యానా కేవ్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. అక్కడ స్ఫటికాకారంలో ఉండే రెండు భారీ రాతి గుహలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇది యాత్రికులకు, ట్రెక్కర్లకు, ప్రకృతి ప్రేమికులకు గొప్ప పర్యాటక అనుభవం

yana caves

ఈ గుహలకు చేరుకోవాలంటే సుమారు 16 కి.మీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. భైరవేశ్వరుడు, జగన్మోహిని శిఖరాలుగా పిలిచే ఈ రాతి గుహల వద్ద శివాలయం కూడా ఉంది. దీంతో ఇది అన్ని రకాల పర్యాటకులను తప్పక ఆకట్టుకుంటుంది.

yana caves

సౌత్‌ గోవాలోని తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి కాబో డీ రామా. ఇదొక చారిత్రక ప్రదేశం. ఈ ప్రదేశం అరేబియా సముద్రం పక్కన ఉండే భారీ కోటతో పాటు అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. చాలా మంది పర్యాటకులకు గోవాలో ఇదొక ప్రదేశం ఉందనే సంగతి కూడా తెలియదు. అలాగే తెలిసిన వారు దీన్ని చూడకుండా తిరిగిరారు.

cabo de rama

అక్కడికి వెళితే అసలైన బ్యూటీని చూడొచ్చు. ఈ కోట నుండి సూర్యాస్తమం వేళ అద్భుతమైన వీక్షణలను చూడొచ్చు. ఈ కోట సందర్శన మీకు ఎప్పటికీ మరచిపోలేని ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. దీంతో గోవా పర్యటనలో దీన్ని తప్పక చూడాల్సిందే.

cabo de rama

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.