Matthew Perry

అమెరికన్ -కెనడియన్ హాస్యనటుడు మాథ్యూ పెర్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మాథ్యూ పెర్రీ మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది.

హాలీవుడ్ నటుడు మాథ్యూ పెర్రీ అనుమానాస్పద మృతి, కారణం ఏంటి..?

సిట్‌కామ్ ఫ్రెండ్స్ సిరీస్‌తో ఫేమస్ అయిన మాథ్యూ పెర్రీ 54 ఏళ్ల వయసులో మరణించారు. ఫెర్రీ మరణంతో హాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

మ్యాథ్యూ పెర్రీ పడిపోయి ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నారేమోనని పరిశీలించారు. కానీ, చివరకు తను డ్రగ్స్ తీసుకోలేదనే నిర్ణయానికి వచ్చారు. మాథ్యూ మృతికి గుండె పోటు కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మాథ్యూ పెర్రీ అవివాహితుడు. నటి మోలీ హర్ట్‌విజ్‌తో కొద్ది రోజులు సహజీవనం చేశారు గానీ అది బ్రేకప్ అయింది. లాస్ ఏంజిలిస్‌లో ఒంటరిగా నివసిస్తోన్నారు.

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.