‘బేబమ్మ’ (ఉప్పెన చిత్రం)గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కృతిశెట్టి త్వరలోనే ‘మనమే’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమెను ‘మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?’ అని హోస్ట్‌ అడగ్గా.. ‘‘నా పనితో రిలేషన్‌లో ఉన్నా’’ అంటూ నవ్వులు పూయించారు.

కాబోయేవాడు ఎలా ఉండాలన్న ప్రశ్నపై స్పందిస్తూ.. నిజాయతీ, ఇతరులపై దయ కలిగి ఉండాలన్నారు.

సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘డ్యాన్స్‌ చేయడమంటే నాకు బాగా ఇష్టం. యాక్షన్‌ కూడా నచ్చుతుంది. హీరోల్లో రామ్‌ చరణ్‌ అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా

ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ‘మనమే’ చిత్రంలో ఉన్నాయి. నేనిందు ఈ పాత్ర ప్రయాణం చాలా తృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది

సినిమా, సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా. చేసిన పాత్రల్నే మళ్లీ మళ్లీ చేయడం నాకు నచ్చదు’’ అని తెలిపారు

శర్వానంద్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మనమే’. జూన్‌ 7న విడుదల కానుంది

శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్‌ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. అందులో ఒక బేబీ కూడా ఉంది. బేబీతో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే శర్వానంద్ చాలా బ్యూటీఫుల్‌గా హ్యాండిల్ చేశారు

సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.

సక్సెస్ ఫెయిల్యూర్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ?

అప్ కమింగ్ ఫిల్మ్స్ ?

మూడు తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే టోవినో థామస్‌తో (Tovino Thomas) ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

Click Here For More Stories