18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా అఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్నికలలో ఎవరెవరు, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఓటరుకి ఉంది. అభ్యర్ధుల డిక్లరేషన్ పత్రాలను ఎన్నికల సంఘం పోర్టల్లో చూసుకోవచ్చు.

ఓటరు కార్డు లేకపోయినా ఫోటో గుర్తింపు కార్డుల్లో ఎదో ఒకటి ఆదారంగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఓటరు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు వేయోచ్చని అనుకోవద్దు. ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. లేకపోతే ఓటు వేసే హక్కును కోల్పోతారు.

85 ఏళ్ళు నిండిన వృద్ధులు, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వ్యక్తులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఇంటికి వచ్చి ఓటు వేయిస్తారు.

ఒకవేళ ఓటు తప్పుగా వేస్తే అక్కడే ఉన్న అధికారులకు సమాచారం అందించాలి. నిబందనల ప్రకారం ఈవీఎంను రీసెట్ చేసి మరో అవకాశం కల్పిస్తారు.

మీ పేరుతో వేరే వాళ్ళు ఓటు వేసినా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 'టెండర్డ్ బ్యాలెట్ పేపర్' పద్దతిలో మీ ఓటును ఎన్నికల అధికారి భద్రపరుస్తారు.

వృద్ధాప్యం, అంగవైకల్యం కారణంగా ఓటు వేయలేకపోతే .. ఎన్నికల అధికారుల సాయం తీసుకోవచ్చు. మీరు చెప్పిన వ్యక్తికి వారు ఓటు వేయిస్తారు.

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరూ నచ్చకపోతే ఈవీఎంలో ఆఖరున ఉండే 'నోటా'కి మీ ఓటు వేయవచ్చు. పై అభ్యర్దులు ఎవరూ నచ్చలేదని చెబుతూ వేసే ఓటు.

ఎన్నికలకు సంబంధించి పిర్యాదులు చేయాలంటే స్థానిక ఎన్నికల అధికారులను సంప్రదించాలి. లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్/ఓటరు హెల్ప్ లైన్/ సీ విజిల్ యాప్ లోనూ పిర్యాదు చేయవచ్చు.