Arrow

ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫికేషన్‌ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్‌ 6న జరిగే మ్యాచ్‌ తన కెరీర్‌లో చివరిదని సునిల్‌ ఛెత్రి తెలిపాడు.

1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్‌ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్‌ బగాన్‌ ‌ క్లబ్‌ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు.

2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా జూన్‌ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్‌ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.

ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్‌), లియోనల్‌ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం.‌ ‌

మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్‌ నా చివరి మ్యాచ్‌ అవుతుందని సునిల్‌ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.

సుమారు రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఫుట్‌బాల్‌ ఆటకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాడు సునీల్ ఛెత్రి.

రిటైర్‌మెంట్‌ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపాడు. రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ భావోద్వేగ వీడియో విడుదల చేశాడు. దీంతో సునీల్ ఛెత్రి పేరు గూగుల్‌ టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది.

రిటైర్మెంట్ ప్రకటించినా.. తనలోని చిన్నపిల్లాడు మాత్రం ఫుట్‌బాల్‌ను ఆడటం ఆపొద్దని చెబుతున్నాడని సునీల్ ఛెత్రి అన్నాడు.

👉అర్జున అవార్డు 👉పద్మశ్రీ 👉ఖేల్‌రత్న 👉AIFF వార్షిక అత్యుత్తమ     ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు 👉మూడుసార్లు ఇండియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు 👉శాఫ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు      సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ

పురస్కారాలు