విష్వక్‌సేన్ దాస్‌ కా ధమ్కీ.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది.

విష్వక్‌ నటన, నివేదా అందాలు యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆహా వేదికగా ఏప్రిల్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 ‘దాస్ క‌దా ధ‌మ్కీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.7.50 కోట్లు జ‌రిగాయి. రూ.8 కోట్లు వ‌స్తేసే సినిమా హిట్ అని ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి.

ఈ మూవీకి తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.8.2 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అయితే సినిమా టీమ్ మాత్రం రూ.8.8 కోట్లు వచ్చినట్లు తెలియజేసింది.

దాస్ కా ధమ్కీ.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నిర్మాత కూడా విశ్వ‌క్ సేన్ కావ‌టం విశేషం.

దాస్‌ కా దమ్కీ లోని మావా బ్రో.. వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను రామ్‌ మిర్యాల స్వరాలు సమకూర్చి ఆకట్టునేలా ఆలపించారు.

విశ్లేషకుల నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం క‌లెక్ష‌న్స్ రూపంలో సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.