Visakhapatnam Covid Cases: జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Covid visakhapatnam

Visakhapatnam covid cases: జిల్లాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు ఫీవర్‌ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళుతున్న వైద్య సిబ్బంది…కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గడిచిన వారం రోజుల్లో 33 మందికి పాజిటివ్‌ (visakhapatnam covid cases) వచ్చినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ముగ్గురికి శుక్రవారం కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. వీరంతా స్వల్ప లక్షణాలతోనే బాధపడుతుండడంతో హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉండేందుకు అవకాశం కల్పించామన్నారు. ఐదుగురు కోలుకున్నారని, ప్రస్తుతం 28 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో వున్నారని అధికారులు తెలిపారు.

Share this Article
Leave a comment