Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల ఆందోళన.. విశాఖలో నిలిచిపోయిన రైలు

Visakha Express

విశాఖపట్నం: సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (visakha express)లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైలులో నీటి సౌకర్యం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం రైలు విశాఖపట్నం చేరుకోగానే ప్రయాణికులు కిందికి దిగి నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచే నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైలులో నీటి సౌకర్యం కల్పించే వరకు విశాఖపట్నం నుంచి రైలును కదలనీయబోమంటూ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు.

Share this Article
Leave a comment