బాలయ్యా మజాకా.. బాలయ్య దెబ్బకు ఓటీటీ షేక్

Bharat Shorts

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘Unstoppable-2‘ శో OTTని షేక్ చేస్తుంది. Unstoppable-2లో మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ కేవలం 4 రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లు OTT సంస్థ ‘AHA‘ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇది ఇండియన్ టాక్ షోలలోనే బిగ్గెస్ట్ అని ట్వీట్ చేయగా.. బాలయ్యనా మజాకా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Unstoppable2 with NBK, Chandrababu Naidu

 

ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు ఆసక్తికర విషయాలను బాలయ్యతో పంచుకున్నారు. జీవితమో మీరు చేసిన తప్పు ఏంటని బాలయ్య చంద్రబాబుని ప్రశ్నించగా .. 2004 ఎన్నికల ముందు అలిపిరి ప్రమాదం జరిగిందని.. ఆ తరవాత ఎన్నికలకు వెళదామని అసెంబ్లీని రద్దు చేసానని , కానీ ఎన్నికలు అనుకున్న సమయంలో జరగకుండా ఆలస్యం అయిందన్నారు. ఆ రోజు అలా చేయకుండా ఉండుంటే ఇంకో విధంగా ఉండేది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ‘భయం లేదు.. భయం అనే మాటకు స్కోప్ ఇవ్వలేదు’ అన్నారు. అదే జీవితంలో చేసిన పెద్ద తప్పుగా బావిస్తాను అని అన్నారు.

 

ఈ షోలో తమ రాజకీయ అనుభవాలు, తమ భార్య, కుటుంభం గురించి అదేవిదంగా అలిపిరిలో 2003లో జరిగిన పేలుడు ఘటన గురించి వివరించారు. అదేవిదంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(NTR) 1984లో ప్రారంభించిన అన్నదానం గురించి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పైనా చంద్రబాబు స్పందించారు.

Share this Article
Leave a comment