Today Horoscope in telugu: నేటి 12 రాశులు వారి రాశి ఫలాలు
మేష రాశి:
ఈ రాశి వారు మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.అనూహ్య ధనలాభం పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
వృషభ రాశి:
ఈ రాశి వారు కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.
మిధున రాశి:
ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి కలిగిన వారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
సింహ రాశి:
ఈ రాశి వారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య రాశి:
మిశ్రమకాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తులా రాశి:
తులా రాశి వారికి శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీఆంజనేయ స్తోత్ర పారాయణ మంచిది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
మకర రాశి:
ఈ రాశి వారు పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. మనఃస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
కుంభ రాశి:
ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్రసంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం.
మీన రాశి:
ఈ రాశి వారు సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతాస్తోత్రం పఠించడం మంచిది.