Visakhapatnam: షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

kims icon hospital visakhapatnam

విశాఖపట్నం: నగరంలోని షీలానగర్ (sheelanagar) వద్ద గల కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి (Kims Icon Hospital) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. కశింకోటకు చెందిన నాగలక్ష్మి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందింది. నాగలక్ష్మికి ప్లేట్ లెట్స్ లేవని డాక్టర్లు మూడూరోజులుగా చికిత్స చేస్తున్నారని ఆమే బంధువులు వెల్లడించారు. ఐదు లక్షలు వసూలు చేసి చివరకు మృతి చేందిందని ఆసుపత్రి డాక్టర్లు సెల్లదిన్చారని.. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందినట్లు మృతురాలు బందువులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉందని వైద్యులు చెప్పేవారని.. కన్నేసం చూడడానికి కూడా అనుమతించే వారు కాదని ఆరోపిస్తున్నారు. దింతో ఐకాన్ ఆసుపత్రి ముందు మృతదేహాన్ని వుంచి బంధువులు ఆందోళన చేపట్టారు. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న కిమ్స్ ఐకాన్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Share this Article
Leave a comment