ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశం.. ఇంక్రిమెంటు నిలుపుదల ఎందుకు చేయకూడదో చెప్పాలి

visakhapatnam school teachers

విశాఖపట్నం (Visakhapatnam News): పెదగదిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలపై (Teachers) చర్యలకు ఆదేశించినట్లు విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శనివారం పెదగదిలి ప్రాథమిక పాఠశాలను సందర్శించినపుడు ఇద్దరు ఉపాధ్యాయినిలు విధుల్లో లేరన్నారు. ఎందుకు లేరో సమాచారం కూడా లేదన్నారు. దీనిపై తగు చర్యలకు ఎంఈఓ (MEO) పైడపు నాయుడుకు ఆదేశించిటం జరిగిందన్నారు. వారికి ఇంక్రిమెంటు నిలుపుదల ఎందుకు చేయకూడదో వివరణ కోరాలని ఎం.ఇ.ఒ.ను ఆదేశించారు.

Share this Article
Leave a comment