...

సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం: గంటా

Bharat Shorts

భీమిలి జోన్లో ఉన్న 1,2,3 వార్డుల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్యను పరిష్కరించడంలో భీమిలి జోన్ అధికారులు విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.

విశాఖపట్నం: భీమిలి జోన్ లో ఉన్న1,2,3 వార్డుల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్యను పరిష్కరించడంలో భీమిలి జోన్ అధికారులు విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండతో కలసి గంటా నూకరాజు మాట్లాడారు.. జీవిఎంసీ పరిధిలో ఉన్న జోన్లలో భీమిలి జోన్ ప్రజలు నీటి సమస్యతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ప్రజల తరపున మొరపెట్టుకున్నా  చీమ కుట్టినట్లు కూడా అధికారులకు లేదని వాపోయారు. ప్రజలయొక్క కనీస అవసరాలు తీర్చని అధికార యంత్రాంగం దేనికని..? గంటా నూకరాజు ప్రశ్నించారు. 2008వ సంవత్సరంలో భీమిలి మున్సిపాలిటీగా ఉండేటప్పుడు ప్రజల దాహర్తిని తీర్చాలనే ఏకైక లక్ష్యంతో పైప్ లైన్ ప్రోజెక్ట్ కి శ్రీకారం చుట్టారని అన్నారు. అవి పూర్తిగా శిధిలావస్థకు చేరడం, తరచూ మరమ్మత్తులు కావడంతో మంచినీటిని సరఫరా చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నాన్యమైన పైపులు వేయడం, లేదా గోదావరి జలాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం,  లేదా గోస్తనీ పరివాహక ప్రాంతమైన ప్రదేశంలో చెక్ డ్యామ్ లు నిర్మించి వాటర్ స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు కార్పొరేటర్ తో కలసి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా, అధికారులలో కనీస స్పందన లేదని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చని అధికారులు, కార్యాలయాలు ఎందుకని అన్నారు.  భీమిలి ప్రజలు మడులు, మాన్యాలు ఏమైనా అడిగారా..? త్రాగడానికి మంచినీరు అందించమంటున్నారు. అదికూడా చేయకపోతే ఎలా అని అడిగారు. దయచేసి భీమిలి ప్రజల తరపున శిరస్సు వంచి వేడుకుంటున్నా ప్రజా జీవనానికి అతి ముఖ్యమైన పరిశుభ్రమైన నీటిని అందించే ప్రయత్నం చేయాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు.

Share this Article
Leave a comment
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.