...

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

Bharat Shorts

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్‌ (New Revenue Divisions)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెవెన్యూ డివిజన్ లో ఏటిపాక, చింతూరు, కూనవరం, రామచంద్రాపురం మండలాలు ఉంటాయి. చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ఆ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలోని రెవిన్యూ డివిజన్లు (New Revenue Divisions) ఇవే:

  1. శ్రీకాకుళం జిల్లా: పలాస, టెక్కలి, శ్రీకాకుళం
  2. విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం
  3. పార్వతీపురం మన్యం: పార్వతీపురం, పాలకొండ
  4. అల్లూరి సీతారామరాజు: చింతూరు,పాడేరు, రంపచోడవరం
  5. విశాఖపట్నం: భీమునిపట్నం, విశాఖపట్నం
  6. అనకాపల్లి: అనకాపల్లి, నర్సీపట్నం
  7. కాకినాడ: పెద్దాపురం, కాకినాడ
  8. కోనసీమ: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట
  9. తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం, కొవ్వూరు
  10. పశ్చిమగోదావరి: నర్సాపురం, భీమవరం
  11. ఏలూరు: జంగారెడ్డి గూడెం, ఏలూరు, నూజివీడు
  12. కృష్ణా: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు
  13. ఎన్టీఅర్: విజయవాడ,తిరువూరు, నందిగామ
  14. గుంటూరు: గుంటూరు, తెనాలి
  15. బాపట్ల: బాపట్ల, చీరాల
  16. పల్నాడు: గురజాల, నరసారావుపేట, సత్తేనపల్లి
  17. ప్రకాశం: మార్కాపురం, కనిగిరి, ఒంగోలు
  18. నెల్లూరు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
  19. కర్నూలు: కర్నూలు, ఆదోని, పత్తికొండ
  20. నంద్యాల: ఆత్మకూరు, డోన్, నంద్యాల
  21. అనంతపురం: అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్
  22. శ్రీసత్యసాయి: ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి
  23. వైఎస్సార్: బద్వేల్, కడప, జమ్మలమడుగు
  24. అన్నమయ్య: రాజంపేట, మదనపల్లె, రాయచోటి
  25. చిత్తూరు: చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం
  26. తిరుపతి: గూడూరు, సూళ్ళురుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి

Share this Article
Leave a comment
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.